రవీనా గతం మరిచిపోయిందా?

రవీనా టాండన్ కిప్పుడు 50 ఏళ్ళు. 50 ప్లస్ ఏజ్ లోనూ ఆమె మంచి శరీరాకృతితో, ఫిట్నెస్ తో ఉంది. ఆమె నటిగా ఇంకా బిజీగా ఉంది. ఇటీవలే ‘కేజీఎఫ్ 2’లో ఇందిరాగాంధీ పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసింది. అంతేకాదు, రవీనా టాండన్ కి రీసెంట్ గా పద్మశ్రీ ప్రకటించింది భారత ప్రభుత్వం.

పద్మశ్రీ రావడంతో ఆమె తన ఇమేజ్ కి ఒక ‘గౌరవాన్ని’ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు చూస్తే అలా అనిపించడం ఖాయం. అలాగే ఆమె గతం మరిచిపోయిందా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది.

రవీనా టాండన్ ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్. “తూ చీజ్ బడి హై మస్త్ మస్త్” పాటతో అప్పట్లో కుర్రకారును ఆకట్టుకున్న భామ ఎన్నో వాన పాటల్లో నటిచింది. అందాలు ఆరబోసింది. తెలుగులో కూడా “స్వాతిలో ముత్యమంతా” అనే పాటలో ఆమె గ్లామర్ ఒలకబోత మాములుగా ఉండదు. హీరోయిన్ అన్న తర్వాత ఇవన్నీ కామన్.

ఐతే, తాను ఎప్పుడూ ఎక్స్పోజింగ్ చెయ్యలేదని తాజా ఇంటర్వ్యూలలో చెప్తోంది. రేప్ సీన్లలో కూడా తాను డ్రెస్ చిరిగినట్లుగా కనిపించేందుకు ఒప్పుకోలేదు అని అంటోంది. ఆమె ఇంటర్వూస్ చూస్తే ఆమె గతం మరిచిపోయిందా అన్న డౌట్స్ వస్తున్నాయి.

ఒక్కసారి యూట్యూబ్ లో తన పాత పాటలు క్లిక్ చేసుకొని చూస్తే చాలు ఆమె అప్పట్లో తాను చాలా ఒద్దికగా నటించిందో, గ్లామర్ హొయలు పోయిందో తెలుస్తుంది.

 

More

Related Stories