
దర్శకుడు-నటుడు-నిర్మాత రవిబాబు మరోసారి మూలాల్లోకి వెళ్లిపోయాడు. వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్న వేళ.. తన మొదటి సినిమా ఫార్మాట్ లోకి మరోసారి దూరిపోయాడు. “అల్లరి” సినిమాను అప్పటి ట్రెండ్, సెన్సార్ నిబంధనలకు లోబడి తీసిన రవిబాబు.. ఈసారి “క్రష్”తో ఏకంగా గేట్లు ఎత్తేశాడు.
తన సినిమాకు సెన్సార్ అవ్వకపోయినా ఫర్వాలేదు, అవసరమైతే ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాననే దృఢనిశ్చయంతో రవిబాబు ఈ సినిమా తీసినట్టున్నాడు. ఈరోజు రిలీజైన ఈ సినిమా టీజర్ చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. అవును.. ఫస్ట్ పీప్ అంటూ రవిబాబు రిలీజ్ చేసిన మొదటి క్రష్ వీడియో పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది.
ఈసారి అడల్ట్ సినిమా తీస్తే ఎలాంటి మొహమాటాలు, అనుమానాలు పెట్టుకోకూడదని గట్టిగా డిసైడ్ అయి ఈ ‘క్రష్’ తీసినట్టున్నాడు రవిబాబు. టైటిల్ కు తగ్గట్టు ఫస్ట్ పీప్ తో కుర్రాళ్లను బాగానే క్రష్ చేశాడు. ఈ వీడియో గురించి ఇంతకంటే చెప్పడానికేం లేదు, చూసి తెలుసుకోవాల్సిందే. ఎవరికి వాళ్లు ఓ అభిప్రాయానికి రావాల్సిందే.
తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పై స్వీయదర్శకత్వంలో రవిబాబు తీసిన ఈ సినిమా కుదిరితే థియేటర్లు, కుదరకపోతే ఓటీటీలోకి దూసుకురాబోతోంది.
టీజర్ చూసేముందు జాగ్రత్త… పూర్తిగా అడల్ట్ కంటెంట్… సో…చూసుకొని క్లిక్ చెయ్యండి.