సలార్ కి మ్యూజిక్ అతనే

Salaar

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందే ‘సలార్’ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. జనరల్ గా ప్రభాస్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ల్స్ లేట్ గా ఫిక్స్ అవుతుంటారు. కానీ ‘సలార్’ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి క్లారిటీ ఉంది. “కేజీఎఫ్” చిత్రాలకు తనతో వర్క్ చేసిన టెక్నీషియన్లనే ఆయన ప్రభాస్ సినిమాకి కూడా రిపీట్ చేస్తున్నాడు.

“కేజీఎఫ్” సినిమాకి టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రవి బస్రుర్ కే ప్రభాస్ సినిమాకి బాధ్యతలు అప్పగించాడు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా షూటింగ్ జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరిలో కానీ మొదలవుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సినిమాకి సంబందించిన మ్యూజిక్ వర్క్ మొదలుపెట్టాడు.ఈ సినిమాకి కెమెరా మేన్ కూడా “కేజీఎఫ్”కి వర్క్ చేసిన భువన్ గౌడ పని చేయనున్నాడు. హీరోయిన్, ఇతర నటులు తప్ప… మిగతా టీం అంతా ప్రశాంత్ నీల్ తో మొదటినుంచి పనిచేస్తున్నవారే ఉంటారు.

More

Related Stories