కొత్త కెమెరామేన్ వచ్చేశాడు

- Advertisement -
Rana and PSPK

పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీ మొన్న సమస్యలో పడింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రసాద్ మూరెళ్ళ హీరో పవన్ కళ్యాణ్ తో, నిర్మాత నాగవంశీతో సమస్య కారణంగా తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో రవి కే చంద్రన్ వస్తున్నారు. ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా పార్ట్ ని చూశారు రవి కే చంద్రన్. ఆయన ఈ మూవీని తీసేందుకు ఒప్పుకున్నారు. ఇక కొత్త షెడ్యూలు స్టార్ట్ కానుంది.

ఈ సినిమాకి దర్శకుడు సాగర్ చంద్ర. మలయాళంలో హిట్టైన ‘అయ్యపనం కోషియం’ అనే సినిమాకిది రీమేక్.

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాకి మొదట కెమెరామేన్ రవి కే చంద్రన్. కొంత భాగం తీసుకున్న తర్వాత రవి కే చంద్రన్ తప్పుకున్నారు. దాంతో తిరు ఆయన స్థానంలో వచ్చి దాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ళ తప్పుకున్న సినిమాని రవి కే చంద్రన్ తీస్తున్నారు.

రవి కే చంద్రన్ ఈ సినిమాని పూర్తి చేస్తే… అయనకిది మొదటి తెలుగు సినిమా అవుతుంది. ఎందుకంటే దాదాపు చాలా సీన్లని రీషూట్ చేస్తారని టాక్.


 

More

Related Stories