ఇదైనా పూర్తి చేస్తారా?


రవి కే చంద్రన్ … గొప్ప సినిమాటోగ్రాఫర్. “మెరుపు కలలు”, “అమృత”, “యువ”, “దిల్ చాహతా హాయ్”, “బ్లాక్” వంటి సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన కెమెరామేన్. ఒకప్పుడు శంకర్, మణిరత్నం, భన్సాలీ, అమీర్ ఖాన్ వంటి బడా మేకర్స్ తోనే వర్క్ చేసేవారు. ఇప్పుడు అయన జోరు తగ్గింది కొంత.

ఆయన తెలుగులోకి మహేష్ బాబు హీరోగా కొరటాల శివ తీసిన ‘భరత్ అనే నేను’ అనే సినిమాతో అడుగుపెట్టారు. కానీ సినిమా మధ్యలోనే వదిలేసి వెళ్లారు. దర్శకుడు కొరటాలకు, ఆయనకి సింక్ కాలేదని టాక్.

మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లోకి రి-ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా యువ దర్శకుడు సాగర్ చంద్ర తీస్తున్న సినిమాకి ఆయన కెమెరామేన్ గా వచ్చారు. ప్రసాద్ మూరెళ్ళ అనే మరో సీనియర్ కెమెరామెన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి వచ్చారు రవి కే చంద్రన్. “పవన్ కళ్యాణ్ తీక్షణమైన కళ్ళు, ఆయన పవర్ ఫుల్ నటనను కొత్త ఫ్రేమ్ లో బంధించే ప్రయత్నం చేస్తాను,” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

మరి ఈ సినిమా పూర్తిగా చేస్తారా అన్నది చూడాలి.

 

More

Related Stories