రవితేజ, బాలయ్య పోటీ తప్పదా?

రవితేజ, బాలయ్య పోటీ తప్పదా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి సినిమాకి ఇంకా పేరు ప్రకటించలేదు. కానీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా మే 28న విడుదల కానుంది. ఈ మూవీ మేకర్స్ ఈ రోజు (జనవరి 31) అధికారికంగా డేట్ అనౌన్స్ చేశారు.

ఐతే, ఇంతకుముందే ఇదే డేట్ ని రవితేజ లాక్ చేసుకున్నాడు. రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘కిలాడీ’ సినిమా మే 28న రిలీజ్ అవుతుందని నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు. ఇపుడు బాలయ్య సినిమా ప్రకటన వచ్చింది. రెండూ ఒకే డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.

కొద్ది రోజులుగా వరుసపెట్టి తెలుగు నిర్మాతలు ఇలా విడుదల తేదీలు చెప్తుండడంతో…. ఇందులో సగం ‘మళ్ళీ మారే తేదీలే’ అని చెపుతూ వస్తున్నారు సినిమా విశ్లేషకులు. మరి రవితేజ బాలకృష్ణతో పోటీ పడుతాడా? డేట్ మార్చుకుంటాడా? అన్నది చూడాలి. “క్రాక్” సినిమా విజయంతో రవితేజ ఊపు మీదున్నాడు. అదే ఊపుతో పోటీకి సై అంటాడా?

మే 28.. ఎన్టీఆర్ జయంతి. ఈ డేట్ విషయంలో బాలయ్యకి సెంటిమెంటల్ వాల్యూ ఉంది. సో, బాలయ్య ఈ డేట్ ని మార్చకపోవచ్చు. మరి రవితేజ, బాలయ్య పోటీ తప్పదా?

More

Related Stories