సమ్మర్ సెలవులు మొదలుకాకముందే రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ట్రిప్పు వేశారు. కొడుకు, కూతురితో కలిసి అమెరికా వెళ్లారు.
రవితేజ “మిస్టర్ బచ్చన్” అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ ని మధ్యలోనే ఆపేసి సడెన్ గా అమెరికా వెళ్లారు. కొన్నాళ్ళూ అక్కడే ఉంటారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా అమెరికా వెళ్లి అక్కడే పాటల సిట్టింగ్ పెట్టాలనుకుంటున్నట్లు టాక్.
56 ఏళ్ల రవితేజ ఇటీవల తన కుటుంబాన్ని ఎక్కువగా విహార యాత్రలకు తీసుకెళ్తున్నారు. ఇటీవలే చైనా, జపాన్ వెళ్లి వచ్చింది వీరి కుటుంబం.
ఇక కెరీర్ పరంగా రవితేజకి ఇప్పుడు ఒక పెద్ద హిట్ కావాలి. “ధమాకా” తర్వాత రవితేజకి హిట్ లేదు. హరీష్ శంకర్ ఇప్పటివరకు రీమేక్ సినిమాలతో అపజయాలు చూడలేదు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న “మిస్టర్ బచ్చన్” కూడా రీమేక్ మూవీనే. సో, రవితేజకి కావాల్సిన హిట్ దీంతో రావొచ్చు.