హిట్లు లేవు కానీ రేట్ హాట్

Khiladi

మాస్ మహారాజా రవితేజ సాలిడ్ హిట్ ఇచ్చి ఎన్ని ఏళ్ళు అవుతోంది? మధ్యలో “రాజా ది గ్రేట్” సినిమా పక్కన పెడితే, గత నాలుగు ఐదేళ్లల్లో రవితేజ ఇచ్చినన్ని ఫ్లాపులు మరో హీరో ఇవ్వలేదు. వరుస అపజయాలతో కొన్నాళ్ళు ఇంట్లోనే కూర్చున్నాడు. అయినా, ఆయన తన మార్కెట్ తగ్గలేదంటున్నాడు. అందుకే, ఇప్పుడు మళ్లీ రేట్ పెంచాడు అనేది మీడియా వార్తలు.

రవితేజ తన రేట్ పెంచినా…. ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తున్నారబ్బా? అనే డౌట్ ఉంది కదూ. రవితేజకి హిందీ డబ్బింగ్ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటిల్ లాంటి మర్కెట్స్ తో మినిమమ్ 20 కోట్లు రూపాయలు వస్తున్నాయి నిర్మాతలకు. అందుకే ఎన్ని ఫ్లాప్ లు ఇచ్చినా రవితేజకి నిర్మాతలు ఉంటున్నారు.

కావాలని రాయించుకున్న ఆర్టికలో, పే.ఆర్ ఎక్సరసైజ్లో భాగమో కానీ రవితేజ ఇప్పుడు 12 కోట్లు రూపాయలు అడుగుతున్నాడు అని మీడియా కథనాలు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. కరోనా తర్వాత కూడా హీరోలు ఒక్కరూ కూడా నయా పైసా తగ్గించుకోవట్లేదు. ఇంకా ఎక్కువ అడుగుతున్నారు.

రవితేజ నటించిన “క్రాక్” రిలీజ్ కి రెడీగా ఉంది. “కిలాడి” అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత మారుతి డైరెక్షన్లో ఒక మూవీ, త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో ఒక మూవీ ఒప్పుకున్నాడు.

Advertisement
 

More

Related Stories