‘కరైకుడి’లో రవితేజ బర్త్ డే

Ravi Teja

రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇటీవలే మొదలైంది ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీ. హైద్రాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. ఇక ఇప్పుడు టీం అంతా తమిళనాడులోని కరైకుడికి వెళ్ళింది.

గురువారం (మే 25) నుంచి కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

జనవరి 26 రవితేజ పుట్టిన రోజు. ఐతే, ఈ సారి ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లోనే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు రవితేజ. ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చెయ్యాలని భావిస్తున్నారట.

రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు ఇందులో. కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

Advertisement
 

More

Related Stories