మహేష్ బాబు బాటలో రవితేజ

- Advertisement -
Ravi Teja

గత కొంతకాలంగా మహేష్ బాబు తాను నటిస్తున్న సినిమాల్లో కొంత భాగాన్ని పారితోషికంగా, మరికొంత లాభాల్లో వాటా రూపంలో తీసుకుంటున్నారు. అందుకే తన సొంత నిర్మాణ సంస్థ GMB Entertainments అనే ప్రొడక్షన్ బ్యానర్ ని అన్ని సీనిమాల్లో ఉపయోగిస్తున్నారు. మహేష్ బాబు బాటలోనే మిగతా హీరోలు కూడా వెళ్తున్నారు.

ఈ రూట్ లోకి మాస్ మహారాజా రవితేజ కూడా వచ్చారు.

రవితేజ నటిస్తున్న కొత్త సినిమా నేటి నుంచి (జులై 1) రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి (‘పడి పడి లేచే మనసు’, ‘విరాట పర్వం’) నిర్మాత. ఇక ఇప్పుడు రవితేజ కూడా సహా నిర్మాతగా తన బ్యానర్ పేరు వేసుకుంటున్నారు.

ఇటీవలే రవితేజ తన నిర్మాణ కంపెనీని స్థాపించారు. మొదటిసారిగా ఇంకా పేరు పెట్టని ఈ సినిమాతో తన బ్యానర్ పేరుని ఉపయోగించనున్నారు.

 

More

Related Stories