రవితేజ ఇంకా తేల్చడం లేదా?

- Advertisement -
Ravi Teja

హీరో రవితేజకి ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ దక్కింది. దాంతో తన పారితోషికాన్ని 15 కోట్ల రేంజుకు పెంచారు రవితేజ. అంత మొత్తం ఇచ్చేందుకు పలువురు నిర్మాతలు జంకిన మాట వాస్తవమే. ఆయన డిమాండ్ కి నిర్మాత విశ్వప్రసాద్ (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ) ఫైనల్ గా ఒప్పుకున్నారు. దాంతో, నక్కిన త్రినాథ రావు డైరెక్షన్లో రవితేజ సినిమా మొదలవుతుంది అని అందరూ భావించారు.

ఐతే, ఈ విషయంలో రవితేజ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని టాక్ నడుస్తోంది. అందుకే, నక్కిన త్రినాథ రావు ఇతర హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నాడు. మరి ఈ సినిమా విషయంలో రవితేజ ఎప్పుడు ఓకే అని చెప్తాడో చూడాలి.

రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా విడుదల అయ్యాక ఒక నిర్ణయానికి వస్తాడేమో.

 

More

Related Stories