
రవితేజ హీరోగా ఒప్పుకున్న కొత్త చిత్రం… ‘ఖిలాడి’. రమేష్ వర్మ డైరెక్షన్లో రూపొందే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసింది సినిమా టీం. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఆగిపోయిన ఒక తమిళ సినిమా కథతో ఈ సినిమాని తీస్తున్నారని వినికిడి.
డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్‌లో రవితేజ ఆకట్టుకుంటున్నారు.
రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జయంతీలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి హీరోయిన్. గద్దలకొండ గణేష్ లో సెక్సీ సాంగ్ లో నటించిన డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం.