మారుతి-అల్లుకి క్రాక్ షాక్!

మారుతి-అల్లుకి క్రాక్ షాక్!

రవితేజ ఎక్కువ పారితోషికం అడిగాడని దర్శకుడు మారుతి, నిర్మాత బన్నీ వాసు, యూవీ వంశీ, అల్లు అరవింద్ టీం అతనితో చెయ్యాల్సిన సినిమాని వదిలేసుకొని గోపీచంద్ తో సెట్ చేసుకున్నారు. రవితేజ నాలుగు ప్లాపులు ఇచ్చి కూడా అంతగా పారితోషికం ఎలా అడుగుతాడని బన్నీ వాసు & అల్లు టీం మండిపడిందట.

రవితేజ మాత్రం తన సినిమాలకు మార్కెట్ ఉందని వాదిస్తూ వచ్చాడు. డబ్బుల విషయంలో తగ్గేది లేదని మారుతి సినిమాని వదులుకున్నాడు. ఇప్పుడు రవితేజదే పైచేయి అయింది.’క్రాక్’ సినిమాతో రవితేజ మళ్ళీ బౌన్స్ అయ్యాడు. అతని మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని ప్రూవ్ అయింది. మంచి మాస్ సినిమా తనకి పడితే… ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించగలనని చూపించాడు. దాంతో రవితేజ వర్సెస్ అల్లు-మారుతి పోటీలో రవితేజనే గెలిచాడు.

“క్రాక్” సక్సెస్ తో ఇప్పుడు మారుతి-అల్లు టీం కక్కలేం, మింగలేమన్నట్లుగా ఉన్నారు.

ఐతే, “క్రాక్” హిట్ అయినంత మాత్రానా, రవితేజ చేసిన తప్పులన్నీ ఒప్పు అయిపోవు. దర్శకుడు అజయ్ భూపతికి “మహా సముద్రం” సినిమా విషయంలో చేసిన అన్యాయం అందరికి తెలుసు. చివరి నిమిషంలో ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చాడు. అతని టైం అంతా వేస్ట్ చేశాడు. ఇలాంటి వాటి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కథలు గురించి కాకుండా రెమ్యూనరేషన్ విషయంలోనే పట్టుపట్టడం కూడా కరెక్ట్ కాదు.

ఐతే, మారుతి-అల్లు టీం విషయంలో మాత్రం రవితేజ గెలిచాడు తన వాదనతో.

More

Related Stories