రవితేజ బలం అదే!

Khiladi

మాస్ మహారాజా రవితేజ తన పారితోషికం విషయంలో బెట్టు చేస్తున్నాడు అని ఇటీవల ఒక ప్రచారం గట్టిగా సాగింది. వరుసగా నాలుగు ఫ్లాపులు ఇచ్చి కూడా 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు అని అంటున్నారు. “నేలటికెట్’, “డిస్కో రాజా”, “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్లు ఇచ్చి కూడా రవితేజ ఈ ధైర్యంతో పారితోషికం విషయంలో పట్టుపడుతున్నాడు అనే ప్రశ్న అందరిలో కలుగుతుంది.

ఇటీవల తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ బాగా పెరిగింది. అందులోనూ హిందీ మార్కెట్ లో మంచి క్రేజున్న హీరోలలో రవితేజ ఒకరు.

రవితేజకి ఇప్పటికి 25 కోట్ల నాన్ థియేట్రికల్ మార్కెట్ (హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి) ఉంది. అందుకే, రవితేజ తగ్గడం లేదు. థియేట్రికల్ మార్కెట్ తగ్గిపోయిన తనతో తీసే నిర్మాతలకు సాలిడ్ గా 25 కోట్లు వస్తుంది.

అందుకే, ఎంత పెద్ద నిర్మాతకైనా రేట్ రిబేట్ లేదంటున్నాడట.

More

Related Stories