కిలాడీగా మారనున్న రవితేజ?

ravi teja new

రవితేజ అప్ కమింగ్ మూవీస్ పై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. త్వరలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు రవితేజ. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనే అంశంతో పాటు.. టైటిల్ పై గాసిప్స్ వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు “కిలాడీ” అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ లాక్ డౌన్ సీజన్ లోనే టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించాలని అనుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశిఖన్నా, నిధి అగర్వాల్ ను హీరోయిన్లగా తీసుకున్నారు.

ఇంతకుముందు రవితేజతో నటించిన అనుభవం రాశిఖన్నాకు ఉంది. ఇద్దరూ కలిసి “బెంగాల్ టైగర్” అనే సినిమా చేశారు. నిధి అగర్వాల్ కు మాత్రం రవితేజతో ఇదే ఫస్ట్ టైమ్.

ఇలా సినిమాకు సంబంధించి ఫీలర్లు బాగానే వస్తున్నాయి కానీ.. రవితేజ మాత్రం ఇప్పట్లో సెట్స్ పైకి రానని కరాఖండిగా చెప్పేశాడు. ఫైనల్ స్టేజ్ లో ఉన్న “క్రాక్” సినిమానే ఆయనింకా పూర్తిచేయలేదు. ఇక ఈ కొత్త సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

Related Stories