రవిప్రకాష్ తో చేతులు కలిపిన సుజనా?

తెలుగు టెలివిజన్ రంగంలో ఒక సంచనలం రేపిన జర్నలిస్ట్ రవిప్రకాష్. 24 గంటల తెలుగు టీవీ న్యూస్ ఛానెల్స్ విప్లవానికి బీజం వేసింది రవిప్రకాష్. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఇప్పుడు సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. మరో కొత్త ఛానెల్ తో తెలుగు ప్రజల ముందుకురాబోతున్నారట. అయితే ఆ ఛానెల్ ఎప్పుడొస్తుంది.. ఎవరి బ్యాకప్ తో వస్తోందనే అంశాలపై చాలా స్పెక్యులేషన్ నడుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సుజనా చౌదరి పేరు తెరపైకొచ్చింది.

ఇంతకుముందు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగాన్ని శాసించిన రవిప్రకాష్ పెట్టబోతున్న ఛానెల్ లో బీజేపీ నేత సుజనా చౌదరి పెట్టుబడులు పెడుతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా కొన్ని కేసుల నుంచి బయటపడ్డారు సుజనా చౌదరి. ఆ క్రమంలో కొన్ని వ్యాపారాల నుంచి తన పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారట. అలా వచ్చిన ఆదాయంతో, రవిప్రకాష్ సహకారంతో ఓ న్యూస్ ఛానెల్ ను ఏర్పాటుచేయాలని సుజనా భావిస్తున్నారట. ఇది ఎంతవరకు నిజమనేది త్వరలోనే తేలుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫీవర్ ఊపందుకోవడంతో.. న్యూస్ ఛానెల్ పెట్టడానికి ఇదే రైట్ టైమ్ అని భావిస్తున్నారు రవిప్రకాష్. సో.. ఈయన ఛానెల్ లో సుజనా పెట్టుబడులు పెడుతున్నారనేది ఎంతవరకు నిజమనేది త్వరలోనే తెలిసిపోతుంది.

 

More

Related Stories