
నిఖిల్ సిద్ధార్థ్ మూడు నెలల క్రితం తన సినిమాకి డేట్ ఇవ్వడం లేదు అని ఏడుపు ముఖం పెట్టాడు. “కార్తికేయ 2” సినిమా విడుదలకి సరైన డేట్ ఇవ్వకుండా చూస్తున్నారు అని ఆల్మోస్ట్ మీడియా ముందు ఏడ్చేశాడు. అప్పుడు ఆయన పరిస్థితి అలా ఉంది. “కార్తికేయ 2” భారీ విజయం సాధించడం, హిందీలో కూడా హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయానని ధీమా వచ్చేసింది.
ఇప్పుడు విడుదల డేట్ గురించి, ఇతర సినిమాల పోటీ గురించి భయపడడం లేదు నిఖిల్. ఎవరితో అయినా పోటీకి సై అంటున్నాడు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న తన ‘ధమాకా’ సినిమాని విడుదల చేస్తున్నట్లు రవితేజ చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. ఆ సినిమాకి పోటీగా ఇప్పుడు ’18 పేజెస్’ వస్తోంది. ‘కార్తికేయ 2’ హిట్ కాకపోయి ఉంటే రవితేజ సినిమాకి పోటీగా తన సినిమాని నిలిపేందుకు భయపడేవాడు నిఖిల్. కానీ, ఇపుడు జంకు గొంకూ లేకుండా ముందుకెళ్తున్నాడు.
రవితేజ భయపడాల్సిన పరిస్థితి. అట్లుంటది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఇచ్చే కిక్.