గుడ్డిలో మెల్ల ఖిలాడీ

రవితేజ కెరీర్ లో ఎన్నో ఫ్లాపులున్నాయి. కానీ అవన్నీ ఒకెత్తు, ఖిలాడీ సినిమా ఒక్కటి మరో ఎత్తు. ఎందుకంటే, మాస్ రాజా కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది ఈ సినిమా. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ హై-బడ్జెట్ మూవీ థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయింది. బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది.

అలా రవితేజ కెరీర్ లో ఎపిక్ డిజాస్టర్ గా నిలిచిన ఖిలాడీ సినిమా, ఓ చిన్న ఊరట మిగిల్చింది. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం క్లిక్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేసిన ఈ సినిమాకు 7 టీఆర్పీ వచ్చింది. ఈ జానర్, ఈ రేంజ్ హీరోల సినిమాలతో పోల్చి చూస్తే, టీవీలో ఇది మంచి రేటింగ్ కింద లెక్క.

క్రాక్ సక్సెస్ తో అమాంతం తన రెమ్యూనరేషన్ పెంచాడు రవితేజ. అలా ఖిలాడీ సినిమా కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నాడు. అటు ఈ యాక్షన్ సినిమాకు ప్రొడక్షన్ బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. అలా భారీగా తెరకెక్కిన ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ లో మాత్రమే అంతోఇంతో మెప్పింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ లో భారీ డీల్స్ సెట్ చేసింది. ఇప్పుడు బుల్లితెరపై మెరిసింది. 

 

More

Related Stories