రవితేజ నిరూపించుకున్నట్లే!

రవితేజ పని అయిపోయింది అనుకున్నప్పుడల్లా ఒక చమక్ చూపిస్తాడు. తాజాగా విడుదలైన ‘ధమాకా’ విషయంలో అదే జరిగింది.

“ధమాకా” సినిమాకి పాజిటివ్ రివ్యూలు రాలేదు. మౌత్ టాక్ కూడా గొప్పగా లేదు. అయినా కూడా మొదటి రోజు కన్నా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా. మొదటి మూడు రోజులు, ఏపీ, తెలంగాణాలో దాదాపు 13 కోట్ల షేర్ తెచ్చుకొంది.

అంటే రవితేజ తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. కొంచెం ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా తీస్తే చాలు తాను బండి లాగుతాను అని ప్రూవ్ చేశాడు. ఈ ఏడాది ఇంతకుముందు రెండు అపజయాలు వచ్చాయి. ‘క్రాక్’ సినిమాకి ముందు అనేక ఫ్లాప్స్. అయినా కూడా మళ్ళీ మంచి ఓపెనింగ్స్ చూపించి తనని తాను నిరూపించుకున్నాడు రవితేజ.

రవితేజ పని అయిపోలేదు. కాకపోతే, రవితేజకి సరైన హిట్ పడాలంటే మంచి మసాలా దినుసులు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అవి మిక్స్ చేస్తేనే హిట్ పడుతుంది.

మూడు రోజుల కలెక్షన్ల పరంగా, నాలుగో రోజు మండే కలెక్షన్ల పరంగా ‘ధమాకా’ సూపర్ పాస్ అయింది. ఐతే, మరో వారం నిలబడితే కానీ కొన్న వారికి డబ్బులు రావు ఆంధ్రాలో. సంక్రాంతి సినిమాల వరకు మరో పెద్ద సినిమా వచ్చేది లేదు. సో, కాంపిటీషన్ లేదు. ఆ విధంగా రవితేజకి లక్కే.

 

More

Related Stories