రవితేజ మీటర్ తిరుగుతోంది

RT 69


ఆటో మీటర్ కన్నా స్పీడ్ గా తిరుగుతోంది రవితేజ పారితోషికం. ఏడాది క్రితం వరకు అన్నీ అపజయాలే.ఒక దశలో మల్టీస్టారర్ సినిమాలు చేద్దామని ఆలోచించాడు. కానీ కరోనా కాలం అతనికి కలిసొచ్చింది. ఈ ఏడాది ‘క్రాక్’ సినిమా విడుదల కాగానే ఏకంగా 3 కోట్లు పారితోషికం పెంచారనేది తెలిసిందే.

అప్పటివరకు 12 కోట్ల తీసుకుంటున్న రవితేజ 15 కోట్లు డిమాండ్ చేసి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఒప్పుకున్నారు. అది అలా ఉండగానే దర్శకుడు నక్కిన త్రినాధరావు సినిమా లైన్ లోకి వచ్చింది. ‘ధమాకా’ పేరుతో ఇటీవలే మొదలైన ఈ సినిమాకి 16 కోట్లు తీసుకున్నారు రవితేజ. నిజానికి ఈ సినిమా ఏడాది క్రితమే మొదలు కావాలి. కానీ పారితోషికం విషయంలో పట్టుబట్టి నిర్మాత 16కి ఓకే చెప్పిన తర్వాతే పట్టాలెక్కించారు.

ఇప్పుడు రవితేజ మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఒకటి, వంశీకృష్ణ అనే మరో దర్శకుడితో మరోటి. ఈ రెండు త్వరలోనే మొదలు కానున్నాయి. ఈ రెండింటికి 18 కోట్లు రేంజులో పారితోషికం. అంటే రెండు చిత్రాలకు కలిపి 36 కోట్ల రూపాయలు ముట్టుతాయి రవితేజకి.

రవితేజ ఇప్పటికే 50 ప్లస్ లో ఉన్నారు. హీరోగా ఆయన కెరీర్ చివరి ఓవర్లుకి చేరింది. సో….వీలైనన్నీ ఎక్కువ సినిమాలు టకాటకా చెయ్యాలి. డిమాండ్ ఉన్నప్పుడే లాగెయ్యాలి. ఇది ఆయన ప్లాన్. హిందీ డబ్బింగ్ మార్కెట్ నుంచి భారీ అమౌంట్స్ వస్తాయి రవితేజ చిత్రాలకు. అందుకే, రవితేజ ఇలా మీటర్
తిప్పుతున్నారు.

Advertisement
 

More

Related Stories