అంతా సెట్ చేస్తోన్న రవితేజ

Ravi Teja

రవితేజ కెరీర్ కి “టైగర్ నాగేశ్వరరావు” సినిమా పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ మూవీ తనకు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ క్రియేట్ చేస్తుంది అని భావించారు రవితేజ. కానీ ఆ సినిమా తెలుగునాట కూడా ఫ్లాప్ అయింది. దాంతో పాటు తన సినిమాల హిందీ డబ్బింగ్ మార్కెట్ కి దెబ్బ పడింది.

ఈ కారణంగా రవితేజతో కొత్త సినిమా షూటింగ్ మొదలు కాకుండా ఆగిపోయింది. దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజతో మరో సినిమాని గ్రాండ్ గా ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. ఐతే, షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. దర్శకుడు బడ్జెట్ వర్కవుట్ కాదు అని నిర్మాతలు భావించారట. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ మార్కెట్ నుంచి పెద్దగా డబ్బులు వచ్చేలా లేవని గ్రహించి బడ్జెట్ లో కోత పెడుతున్నారు.

ఐతే, సినిమాని మొత్తంగా ఆపెయ్యడం లేదు. ఈ సినిమా డిసెంబర్ లో పట్టాలు ఎక్కేలా రవితేజ ఇప్పుడు అంతా సెట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా నిర్మాతలు ప్రకటించలేదు.

Advertisement
 

More

Related Stories