పనీపాటాలేని బ్యాచ్ అది: రవితేజ

Ramarao


రవితేజ కొంతకాలంగా నిర్మాతలను సతాయిస్తున్నాడనే మాట బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా పారితోషికం విషయంలో ఆయన గట్టిగా ఉంటాడు. అందులో అనుమానం లేదు. కానీ సినిమా ప్రొడక్షన్ మొత్తం పూర్తి కాకముందే ఒప్పుకున్న పారితోషికం మొత్తం ఇచ్చేయాలని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు అని ఇటీవల వార్తలు మొదలయ్యాయి. ఇలాంటి ప్రచారం ఆయన్ని విలన్ గా మార్చింది ఇండస్ట్రీలో.

‘ఖిలాడీ’ సినిమా టైంలో రవితేజ అలాగే చేశాడని ఆ సినిమా దర్శకుడు రమేష్ వర్మ భార్య కామెంట్ చేశారు.

అలాగే, ‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయంలో కూడా ఈ సినిమా నిర్మాత సుధాకర్ ని రవితేజ ఏడిపించాడు అని కొన్ని వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. వాటిపై తాజాగా రవితేజ స్పందించారు. “రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి నేను కూడా ఒక నిర్మాతని. నా సినిమా ఆగిపోయేలా ప్రవర్తిస్తానా? కొంతమంది పనీపాటా లేని బ్యాచ్ ఇలాంటివి సృష్టిస్తుంది. వాటిని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేం,” అని క్లారిటీ ఇచ్చారు రవితేజ.

ఈ నెలాఖర్లో విడుదల కానుంది ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో కూడా రవితేజ పాల్గొంటున్నారు.

గాసిప్ లు లేకుంటే కూడా లైఫ్ చప్పగా ఉంటుంది అని రూమర్స్ గురించి వర్రీ కానని కూడా చెప్పారు రవితేజ. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు.

 

More

Related Stories