బాలయ్యతో గొడవ… రవితేజ క్లారిటీ

- Advertisement -
Ravi Teja and Balakrishna

బాలయ్య, రవితేజ మధ్య పెద్ద గొడవ జరిగిందనే పుకారు చాలాకాలం నడిచింది. రవితేజపై బాలయ్య చెయ్యి చేసుకున్నాడని కూడా జనబాహుళ్యంలో ఉన్న ఒక మాట. ఈ పుకార్ల గురించి ఆ ఇద్దరి హీరోలకు కూడా తెలుసు. అందుకే, “అన్ స్టాపబుల్” టాక్ షోకి అతిథిగా వచ్చిన రవితేజని మొదట ఇదే ప్రశ్న అడిగారు బాలయ్య.

“నీకు నాకు పెద్ద గొడవైందట,” అని బాలయ్య అడగ్గానే, “పనీపాటా లేని డాష్ నా డాష్ గాళ్ళకి ఇదే పని. ఇలాంటి పుకార్లు క్రియేట్ చేస్తారని,” రవి తేజ సమాధానమిచ్చారు.

2007 నుంచి ఈ ప్రచారం ఉంది. మొదటిసారి వాళ్లిద్దరూ పబ్లిక్ గా ఈ పుకారు గురించి ప్రస్తావన తెచ్చి వివరణ ఇవ్వడం విశేషం. అలా ఒక ప్రచారానికి ఎండ్ కార్డు పడింది.

ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న “అన్ స్టాపబుల్” టాక్ షోని బాలయ్య అద్భుతంగా హోస్ట్ చేస్తున్నారు. ఇది బాగా సక్సెస్ అయింది. ఈ నెలాఖరులో ఈ ఎపిసోడ్ స్ట్రీమ్ అవుతుంది.

 

More

Related Stories