రవితేజ ఆవిష్కరించిన బరాత్ పాట

Barat song

సంజయ్ రావు హీరోగా మైక్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా “స్లమ్ డాగ్ హజ్బెండ్”. ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటిస్తోంది. డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

చిత్రీకరణ తుది దశలో. తాజాగా “స్లమ్ డాగ్ హజ్బెండ్” సినిమా నుంచి బరాత్ సాంగ్ ను మాస్ రాజా రవితేజ విడుదల చేశారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు రవితేజ.

ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా..భీమ్స్ సిసిరోలియో స్వరపర్చి పాడారు. బరాత్ సందడి, ఉత్సాహం అంతా ఈ పాటలో కనిపించింది.

‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ బరాత్ సాంగ్ …ఈ పాట ఇక్కడ చూడొచ్చు…

Lacchi Gaani Pelli - Lyrical Video | Slum Dog Husband | Sanjay Rrao, Pranavi | Bheems Ceciroleo

Advertisement
 

More

Related Stories