రవితేజ షాక్ కి గురి చేస్తాడు: నామా

రావణాసుర’ సినిమాలో రవితేజ లాయర్ గా నటించాడు. రేపే (ఏప్రిల్ 7) విడుదల కానుంది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అభిషేక్ నామా నిర్మాత. ట్రైలర్ లో చూసింది వేరు సినిమాలో చూడబోతున్నది వేరు అని అంటున్నారు నిర్మాత అభిషేక్ నామా.

“సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఒక షాక్ కి గురవుతారు. రవితేజని కొత్త కోణంలో ప్రెజెంట్ చేశారు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. అది ఏంటనేది సస్పెన్స్. రవితేజ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ అవుతారు ప్రేక్షకులు,” అని చెప్పారు ఆయన.

ఇది కాకుండా కళ్యాణ్ రామ్ తో ఆయన “డెవిల్” అనే సినిమా తీస్తున్నారు. “డెవిల్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తాం,” అన్నారు నామా. “2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం. నిర్మాతగా చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి,” అంటున్నారు అభిషేక్ నామా.

Ravanasura

అలాగే తనపై వస్తున్న రూమర్ల గురించి కూడా స్పందించారు. “నేను ఏ హీరోయిన్ తో డేటింగ్ చెయ్యట్లేదు. అవన్నీ పనికిమాలిన పుకార్లు,” అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
 

More

Related Stories