ఇక ఈగిల్ ప్రకటన

రవితేజ స్పీడ్ ఇంకో హీరోకి రాదు. ఒక సినిమా విడుదల కాకముందే మరో రెండు సినిమాలు లైన్ లో ఉంటాయి. ‘ధమాకా’ తర్వాత ‘వాల్తేర్ వీరయ్య’, ‘రావణాసుర’ సినిమాలు విడుదల చేశారు. ఇక ఈ అక్టోబర్ లో ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాని రిలీజ్ చేస్తారు.

ఇప్పటికే ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. దాంతో, మరో సినిమాని ప్రేక్షకులకు పరిచయం చెయ్యనున్నారు రవితేజ. కొంతకాలంగా ఆయన ‘ఈగిల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా సాగుతోంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ‘ఈగిల్’ని అధికారికంగా ప్రకటించే సమయం ఆసన్నమైంది. వచ్చే వారమే ప్రకటన.

పలు సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఈగిల్’ అనేది ఇప్పటివరకు వర్కింగ్ టైటిల్. అదే ఇప్పుడు అసలు టైటిల్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

ఇక ‘ఈగిల్’ కూడా స్పీడ్ గా పూర్తి చేసి ఇంకో కొత్త సినిమాని కూడా సెట్ పైకి తేవాలనుకుంటున్నారు. ఇద్దరు యువ దర్శకులతో చర్చలు సాగుతున్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక మూవీ ఉంటుంది.

Advertisement
 

More

Related Stories