దర్శకుడిపై రవితేజ సెటైర్లు!

- Advertisement -
Ravi Teja


రవితేజ నటించిన ‘ఖిలాడి’ రేపు విడుదల కానుంది. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకుడు. ఇతను ఇంతకుముందు రవితేజతో ‘వీర’ అనే సినిమా కూడా తీశారు. కానీ ‘ఖిలాడి’ షూటింగ్ టైంలో రవితేజకి, దర్శకుడి రమేష్ వర్మకి ఎక్కడో గ్యాప్ ఏర్పడింది అని టాక్. దానికి తగ్గట్లే ఉన్నాయి రవితేజ మాటలు.

“నేను జాత‌కాన్ని అదృష్టాన్ని న‌మ్మ‌ను. క‌ష్టాన్ని న‌మ్ముతా. కష్టపడి పని చేస్తాను. ఒక‌శాతం అదృష్టం తోడవుతుందేమో,” అని తన గురించి చెప్పారు రవితేజ. అదే దర్శకుడు రమేష్ వర్మ గురించి మాత్రం అతనికి ఎక్కడో ఎదో ఉందన్నట్లుగా మాట్లాడారు.

“ర‌మేష్‌వ‌ర్మ‌ను చూస్తే జాత‌కం, అదృష్టం రెండూ క‌లిసి వ‌చ్చాయ‌నిపిస్తుంది. ఈ సినిమాకు నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌గారు అన్ని ప్రొవెడ్ చేయ‌డ‌మేకాకుండా మొన్న‌నే ర‌మేష్‌కు కారును బ‌హూక‌రించారు. అందుకే ర‌మేష్ వ‌ర్మ మ‌హ‌ర్జాత‌కుడు అని అంటున్నాను,” అని చెప్పారు రవితేజ. అంటే రమేష్ వర్మ కష్టాన్ని కాకుండా లక్ ని నమ్ముకొని ముందుకెళ్తున్నాడని సెటైర్ వేసినట్లుగా అనిపిస్తోంది.

ఇంతగా వారిద్దరి మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటో?

 

More

Related Stories