మూడో సినిమాతో జింతాక్!

రవితేజ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేశారు. అవే – ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ. రెండూ ఒకే ఫలితాన్ని చూశాయి. ఏది పెద్ద ఫ్లాప్ అని అడిగితే చెప్పలేం. అయినా, రవితేజ డీలా పడలేదు. ఇప్పుడు మూడోది విడుదల చెయ్యనున్నాడు.

రవితేజ, దర్శకుడు త్రినాథరావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం… “ధమాకా”. ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. అంతే కాదు, ఈ సినిమా ప్రమోషన్లు కూడా షురూ చేస్తున్నారు.

ఈ సినిమా నుండి మొదటి పాట “జింతాక్” ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రవితేజ కుర్ర భామ శ్రీలీలతో జతకట్టారు. ‘పెళ్లి సందD’ సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ పక్కా మాస్ రోల్ లో నటిస్తోంది. ఈ పాట పోస్టర్‌ లో రవితేజ నడుము ఎక్కి కూర్చొంది. శ్రీలీల. పోస్టర్ చూస్తుంటే మా…మా… మాస్ అనిపిస్తోంది కదా.

మరి ఈ సినిమాతో అయినా రవితేజ హిట్ కొడతాడా అనేది చూడాలి.

 

More

Related Stories