కథ దొరికితే మల్టీస్టారర్ చేస్తా: బాలయ్య

- Advertisement -
Balakrishna


“మంచి కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు సిద్ధం. దేనికైనా రెడీ,” అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ‘అఖండ’ సినిమా ఘన విజయం సాధించడంతో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి.

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య.

“సినిమా విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం. ‘అఖండ’ రిలీజ్ కి ముందు ఆంధ్రప్రదేశ్ లో సరైన టికెట్ రేట్ల లేవు కదా అని ఆలోచించుకోమన్నారు మా శ్రేయాభిలాషులు. కానీ సినిమా బాగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం. మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. మా అంచనాలు కరెక్ట్ అయ్యాయి. సినిమా చూసేందుకు సకుటుంబ సపరివార సమేతంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం శుభపరిణామం,” అన్నారు బాలయ్య.

“అఖండ సినిమా విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చింది. అందరూ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ మంచి టైం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ల విధానంపై గతంలోనే నేను మాట్లాడాను. తాజాగా కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం ఏమి జరుగుతుందో.. అప్పుడు మళ్ళీ స్పందిస్తా,” అని బాలయ్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇంకా ఎక్కువ సినిమాలు చేసేందుకు సిద్ధమని బాలయ్య ప్రకటించారు.

 

More

Related Stories