అందుకే బ్రేకప్ చెప్పిందట!

Disha Patani

ఆరేళ్ళ పాటు సాగింది దిశ పటాని, టైగర్ ష్రాఫ్ ప్రేమాయణం. పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వచ్చే వేళ బ్రేకప్ చెప్పుకున్నారు. వీరి బ్రేకప్ గురించి తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే తెలిపింది (ఆ వార్త ఇక్కడ చదవొచ్చు).ఇప్పుడు వీరి బ్రేకప్ వెనుకున్న కారణాలు కూడా బయటపడ్డాయి.

టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా స్థిరపడ్డాడు. అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. ఐతే, ఈ హీరో ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదట. దిశ పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాడట. ఇప్పుడు ఆమెకి క్లారిటీ వచ్చింది. అసలు తనని అతను పెళ్లాడే ఉద్దేశంలో లేదని ఆమె అర్థం చేసుకుందట.

అందుకే, దిశ టైగర్ కి కటీఫ్ చెప్పినట్లు సమాచారం. ఐతే, వీరి ఇద్దరి విషయంలో మరో పుకారు కూడా చాలా కాలంగా ఉంది. ఆ విషయం ఎంత వరకు నిజమో తెలీదు కానీ, అది కూడా ఒక కారణం కావొచ్చు అని బాలీవుడ్ ఇన్ సైడ్ పార్టీల్లో గుసగుసలు.

ఆమె ఇప్పుడు టాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ షిఫ్ట్ చేసేలా ఉంది. ఇప్పటికే ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తోంది.

 

More

Related Stories