అందుకే ఏనుగును వెనక్కు జరిపారు

లాంగ్ గ్యాప్ తర్వాత హరి దర్శకత్వంలో ఏనుగు అనే సినిమా వస్తోంది. అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. సింగం సిరీస్ తర్వాత హరికి గ్యాప్ వచ్చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఏనుగుతో ప్రేక్షకులముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. రిలీజ్ కు అంతా రెడీ అనుకున్న టైమ్ లో సినిమాను ఉన్నఫలంగా వాయిదా వేశారు. లేదంటే ఈ వీకెండ్ ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉంది.

సినిమాలకు డేట్స్ ఎనౌన్స్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం కామన్. అలాగే ఏనుగు సినిమాను కూడా వాయిదా వేశారని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ విషయం వేరు. ఆల్రెడీ థియేటర్లలో ఉన్న మరో సినిమా కోసం, ఈ సినిమాను వాయిదా వేశారట. అదే విచిత్రం.

కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్టయింది. ఆ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఆ సినిమాకు పోటీగా ఏనుగును దించడం ఇష్టంలేక, వాయిదా వేశారట. ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించడంతో పాటు.. కమల్ ను కలిసి బొకే ఇచ్చి మరీ ఫొటోలు వదిలారు.

మరి దీన్ని పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా లేక నిజంగానే మేకర్స్ ఇంత ఉదారంగా వ్యవహరించారు అనుకోవాలో అర్థం కాక జనాలు తలలు పట్టుకున్నారు. 

 

More

Related Stories