నయన నో అంటే 2 కోట్లు సేవ్!

Nayanthara

నితిన్ హీరోగా రూపొందనున్న “అంధధూన్” తెలుగు రీమేక్ లో నెగెటివ్ పాత్ర పోషించేందుకు నయనతార అంగీకరించింది. ఆమెని ఒప్పించేందుకు నితిన్ కూడా రంగంలోకి దిగాడు. తీరా ఆమె ఒప్పుకున్న తర్వాత వద్దనుకున్నారు. చివరికి తమన్నాని తీసుకోవడంలో ఉన్న మతలబు ఏంటి?

సింపుల్ రీజన్: పారితోషికమే. నయనతార ఈ సినిమాకి 4 కోట్లు డిమాండ్ చేసింది. బేరసారాలు చేస్తే 3.5 వరకు వచ్చిందిట. అంతకుమించి తగ్గేదిలేదు అని చెప్పడంతో … నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమన్నాని ఒప్పించాడు. తమన్నా ఈ సినిమాకి 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. అంటే 2 కోట్ల రూపాయలు సేవ్ అయ్యాయి.

Also Read: మనీకి పడిపోయిన మిల్క్ బ్యూటీ

నయనతార చేస్తే… వచ్చే కిక్ వేరు. కానీ ఆమె చేస్తే సినిమా బడ్జెట్ మరో మూడు కోట్లు (రెమ్యూనరేషన్ తో పాటు హోటల్స్, ఇతర ఖర్చులు) పెరుగుతుంది. ప్లస్, ఆమె అసలు సినిమాని ప్రోమోట్ చెయ్యదు. అందుకే తమన్నాని తీసుకున్నారు. బడ్జెట్ తగ్గుతుంది. ప్రమోషన్ అదరగొడుతుంది.

Related Stories