ఏడాదిన్నర ముందే బుకింగ్

NTR


ఎన్టీఆర్ 30వ చిత్రం గురించి పూర్తి క్లారిటీ వచ్చింది. 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ఈ సినిమాకి సంబందించిన అధికారిక అప్డేట్ వచ్చింది. వచ్చే నెలలో మొదలు అవుతుంది రెగ్యులర్ షూటింగ్. ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది.

‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యారని భావిస్తున్నారు. అందుకే, ఏడాదిన్నర ముందే సినిమాకి విడుదల తేదీని ప్రకటించారు. ఉగాది, రంజాన్, అంబేద్కర్ జయంతి, శ్రీరామనవమి… ఇలా చాలా హాలిడేస్ రెండు వారాల పాటు కలిసి వస్తాయని అందరికన్నా ముందే డేట్ బుక్ చేసుకున్నారు. పైగా వేసవి సెలవులు. అందుకే రిలీజ్ డేట్ ని సినిమా షూటింగ్ మొదలు కాకముందే ప్రకటించారు.

ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ. ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’ వీరి కాంబినేషన్ లో వచ్చింది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది కొరటాల శివకి. ఈ సినిమాకి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రత్నవేలు కెమెరా వర్క్ చేస్తారు. ఐతే, ఈ సినిమాని ఐదు భాషలతో పాటు జపాన్ లో కూడా విడుదల చేస్తారా అన్నది చూడాలి.

NTR30

ఎన్టీఆర్ ఇప్పుడు తనకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని కాపాడుకునేందుకు చాలా కాలిక్యులేటడ్ గా వెళ్తున్నట్లు సమాచారం.

 

More

Related Stories