హీరో అరెస్ట్ వెనక అసలు రీజన్

Sachin Joshi

టాలీవుడ్ హీరో సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా దుబాయ్ లోనే ఉంటున్న సచిన్ జోషి, నిన్న ముంబయికి వచ్చాడు. ఆల్రెడీ అతడిపై లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఎయిర్ పోర్టు అధికారులు అతడ్ని నిర్బంధంలో ఉంచి, హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

సచిన్ జోషి అరెస్ట్ అయిన వెంటనే అతడిపై “డ్రగ్స్ పుకార్లు” చెలరేగాయి. ప్రస్తుతం బాలీవుడ్, శాండిల్ వుడ్ లో డ్రగ్స్ కేసులు నడుస్తున్న నేపథ్యంలో.. సచిన్ జోషిని కూడా ఇదే వ్యవహారంపై అరెస్ట్ చేసి ఉంటారని అంతా భావించారు. కానీ కొద్దిసేపటి కిందట సీపీ అంజనీకుమార్ ఈ అరెస్ట్ పై స్పందించారు. నిషేధిక గుట్కా తయారీ-సరఫరా ఆరోపణలపై సచిన్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ఈ ఏడాది మార్చి నెలలో కోటి 25 లక్షల రూపాయల విలువైన పాన్-మసాలా ప్యాకెట్లు, ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపా మసాలా పేరుతో సచిన్ ఈ నిషేధిత ఉత్పత్తులు తయారుచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు వీటికి సంబంధించి మానిక్ చంద్ సంస్థ కూడా ఫిర్యాదు చేయడంతో గగన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే సమయంలో సచిన్ దుబాయ్ లో ఉన్నాడు. దీంతో అతడి కోసం లుక్ అవుట్ నోటీసు జారీచేశారు పోలీసులు. నిన్న సచిన్ దుబాయ్ నుంచి ముంబయి రావడం, ఆ వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. తెలుగులో “మౌనమేలనోయి”, “ఒరేయ్ పండు”, “వీడెవడు” లాంటి సినిమాల్లో నటించాడు సచిన్.

Advertisement
 

More

Related Stories