అల్లుడి హడావిడి అందుకే

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ దాదాపు పెద్ద హీరోలంతా షూటింగ్స్ కు దూరమయ్యారు. చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్ ను వాయిదా వేసుకున్నారు. అయితే చిరంజీవి అల్లుడు మాత్రం డేర్ చేశాడు. కల్యాణ్ దేవ్ సెట్స్ పైకి వచ్చాడు. సూపర్ మచ్చి షూటింగ్ స్టార్ట్ చేశాడు.

స్వయంగా చిరంజీవి అల్లుడు సెట్స్ పైకి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అల్లుడ్ని మామ ఆపలేదా అంటూ ఒకటే డిస్కషన్. అయితే దీనికి ఓ కారణం ఉంది. సూపర్ మచ్చి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది ప్యాచ్ వర్క్ తో పాటు రీషూట్ మాత్రమే.

సూపర్ మచ్చి సినిమా ఎడిటింగ్ వెర్షన్ తో పాటు మొత్తం సిద్ధంగా ఉంది. కేవలం చిరంజీవి చెప్పిన కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేస్తున్నారంతే. అది కూడా వారం రోజులు మాత్రమే.

అయితే వారం రోజుల షూటింగ్ కు కూడా ఇంత కంగారెందుకు అనే అనుమానం కలగొచ్చు. అక్కడికే వస్తున్నాం. ఈ వారం రోజుల ప్యాచ్ వర్క్/రీషూట్ కంప్లీట్ అయితే సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఫస్ట్ కాపీ రెడీ అయితే, థియేట్రికల్ రిలీజ్ తో సంబంధం లేకుండా మూవీని ఓటీటీకి ఇచ్చేయాలనే ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారట. అందుకే ఈ హడావుడి.

Related Stories