ఈ వారమే రెడ్ ట్రైలర్!

Red

రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న “రెడ్” సినిమా రిలీజ్ కి ముస్తాబవుతోంది. మొన్నటివరకు ఈ సినిమా విడుదల డేట్ పై ఊగిసలాడిన టీం ఎట్టకేలకు ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చింది. సంక్రాతి 2021 బరిలోనే దిగుతాడు రామ్.

క్రిస్మస్ స్పెషల్ గా ఈ సినిమా ట్రైలర్ వారమే (December 24) విడుదల అవుతుంది. ఇప్పటికే రామ్.. “రెడ్” అప్డేట్ చెప్తాను అని ట్వీట్ చేశాడు.

“ఇస్మార్ట్ శంకర్” అందించిన ఊపులో రామ్ నటించిన మూవీ… “రెడ్”. తమిళ సినిమా “తడం” రీమేక్ ఇది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లర్ లో రామ్ ది ద్విపాత్రాభినయం. మాళవిక శర్మ, నివేత పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్లు.

More

Related Stories