- Advertisement -

రెజీనా కసాండ్ర వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ‘శాకినీ డాకిని’ అనే ఒక యాక్షన్ సినిమాలో నివేథా థామస్ తో కలిసి నటిస్తోంది. అలాగే, వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది రెజీనా.
తాజాగా ఆమె ‘బ్రేకింగ్ న్యూస్’ అనే చిత్రం ఒప్పుకొంది. రెజీనా, సుబ్బరాజు, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’ . సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
‘‘ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో సామజిక వ్యంగ్య చిత్రంగా దీని తెరకెక్కిస్తున్నాం,” అని నిర్మాతలు తెలిపారు.
షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.