- Advertisement -

రెజీనాకి హీరోయిన్ గా క్రేజ్ తగ్గి చాలా కాలమే అయింది. ఐటెం గాళ్ గా మెప్పిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. ‘ఆచార్య’ సినిమాలో ఆమె ‘శానా కష్టం’ అనే సాంగ్ లో నటించింది. సినిమాని చూడడం శానా కష్టం అని జనం తీర్పు ఇచ్చారు. ఇక, ఆమెకి ఆ కెరీర్ కూడా కట్.
అందుకే కాబోలు, ఈ భామ వెబ్ సిరీస్ లతో బిజీగా మారుతోంది. ఇప్పటికే నాలుగు వెబ్ సిరీస్ లు ఒప్పుకొంది. అవన్నీ హిందీలోనే.
హాక్స్, ఫింగర్ ప్రింట్ సీజన్ 2, ఫర్జీ వంటి వెబ్ డ్రామాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగులో ఆమె మరో హీరోయిన్ హీరోయిన్ నివేత థామస్ తో కలిసి నటించిన చిత్రం కూడా డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల కానుంది.
మొత్తమ్మీద, రెజీనా ఇక వెబ్ భామగా స్థిరపడ్డట్లే. అక్కడే కెరీర్ సెట్ చేసుకొంది.