
పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ తీస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రం షూటింగ్ ఇటీవలే మళ్ళీ మొదలైంది. ఈ సినిమాని దసరాకి విడుదల చెయ్యాలనేది ప్లాన్. ఆగస్టునాటికి షూటింగ్ పూర్తి చెయ్యాలని పట్టుదలగా ఉన్నారు క్రిష్.
ఐతే, పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయ యాత్రలు చేస్తుండడంతో… ఆగస్టులోపు షూటింగ్ పూర్తి అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. అందుకే, సంక్రాంతి 2023కి విడుదల అవుతుందేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఐతే, విడుదల తేదీ అనేది షూటింగ్ పూర్తి అవ్వడాన్ని బట్టి ఉంటుంది. ప్లాన్ చేసినట్లు ఈ సినిమా ఆగస్ట్ లోపే పూర్తి అయితే… దసరా బరిలో ఉంటుంది ‘హరి హర వీరమల్లు’. ఒకవేళ షూటింగ్ లో జాప్యం ఉంటే ‘సంక్రాంతి’కి ఫిక్స్ చేసుకోవచ్చు.
సమ్మర్ సెలవులు ముగిశాక ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.
‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొఘలుల కాలంనాటి దొంగగా కనిపిస్తారు. ఒక విధంగా రాబిన్ హుడ్ తరహా పాత్ర. భారీ సీట్లతో, గ్రాఫిక్స్ తో తెరకెక్కుతోన్న మూవీ ఇది.