కారు పన్ను కడుతాను: విజయ్

- Advertisement -
Vijay

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారుకి సుంకం చెల్లించేందుకు అంగీకరించారు తమిళ సూపర్ స్టార్ విజయ్, 2012లో కొన్న ఈ కారు పన్ను చెల్లించేందుకు విజయ్ ఒప్పుకోలేదు. ఈ కేసు అప్పటి నుంచి నడుస్తోంది.

ఐతే, ఇటీవల మద్రాస్ హైకోర్టుకి చెందిన సింగిల్ బెంచ్ జడ్జి విజయ్ పన్ను చెల్లించాలనే తీర్పు ఇచ్చారు. అంతేకాదు, లక్ష రూపాయల ఫైన్ కూడా వేశారు. విజయ్ రియల్ లైఫ్ లో కూడా హీరోగా ప్రవర్తిస్తే మంచిది అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఆ జడ్జి.

ఈ తీర్పుపై విజయ్ అప్పీల్ కి వెళ్లారు. ఆ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది మద్రాస్ హైకోర్టు. ఐతే, పన్ను మాత్రం చెల్లించాలని చెప్పింది. దాంతో విజయ్ పన్ను చెల్లించేందుకు ముందుకొచ్చారు.

మద్రాస్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు విజయ్ పరువు తీశాయి. బాగా నెగెటివ్ పబ్లిసిటీ వచ్చింది అని విజయ్ గ్రహించి… ఇప్పుడు పన్ను కడుతానని ఒప్పుకున్నారు. విజయ్ కి పాలిటిక్స్ లోకి రావాలనే ఆలోచన ఉంది. వెండితెరపై నీతికి, న్యాయానికి కట్టుబడి ఉండే హీరో పాత్రలు పోషించే ఈ హీరో రియల్ లైఫ్ లో పన్ను కట్టేందుకు సాకులు వెతుక్కుంటున్నారు అనే నెగెటివ్ ప్రచారం వచ్చింది. దాంతో, విజయ్ ఇప్పుడు ప్లేట్ మార్చారు.

సినిమాకి 70 నుంచి 80 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు విజయ్. అంత సూపర్ రిచ్.

 

More

Related Stories