రేణు పాన్ ఇండియా మూవీ

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగులో రెండో ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో “ఆద్య” అనే సినిమా రూపొందుతోంది. ఆమె పాత్ర కీలకంగా ఉంటుందట.

రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కృష్ణ మామిడాల దర్శకుడు. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి, గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది.

Related Stories