పవన్ కళ్యాణ్ కే నా మద్దతు: రేణు

- Advertisement -
Renu

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఉన్నట్టుండి ఒక వీడియో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కే తన మద్దతు అని ఆమె ఈ వీడియో ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ అరుదైన వ్యక్తి అని, ఆయన సమాజానికి మంచి చేసే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి వెబ్ సిరీస్ తీస్తామని ఇటీవల మంత్రి రాంబాబు చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఆమె స్పందించారు.

“నా మాజీ భర్త నా విషయంలో చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ దానికి, ఆయన రాజకీయాలకు సంబంధం లేదు. ప్రజలకు మంచి చెయ్యాలనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకి డబ్బు యావ లేదు.

రాజకీయంగా మీరు విమర్శలు చేసుకోండి. ఆ గొడవల్లోకి పిల్లలను లాగకండి. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను వాటిల్లోకి లాగకండి. వాళ్లు ఇంకా చిన్న పిల్లలే. ఒక తల్లిగా అభ్యర్థన ఇది. నా పిల్లల తండ్రి ఒక పాపులర్ నటుడు, రాజకీయనాయకుడు. కాబట్టి మా జీవితాల మీద ఫోకస్ ఉండొచ్చు. పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు.”

 

More

Related Stories