
కొంత గ్యాప్ తర్వాత హన్సిక నటిస్తున్న తెలుగు చిత్రం.. “మై నేమ్ ఈజ్ శృతి”. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్. ఈ చిత్రంలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత’ అంటూ కొనసాగే టైటిల్ లిరికల్ సాంగ్ ని మంగళవారం విడుదల చేశారు. మార్క్ రాబీన్ సంగీత దర్శకత్వంలో కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ ఆలపించారు.
మనిషి చర్మం వలిచి బిజినెస్ చేసే ఓ గ్యాంగ్‌తో ఓ యువతి చేసే పోరాటమే “మై నేమ్ ఈజ్ శృతి” అని అంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు.
“ఇలాంటి ఇంటెన్స్ స్టోరీని నేను ఎప్పుడూ చేయలేదు. సినిమాలో వుండే ట్విస్ట్‌లు అందరిని ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రంలో ఈ పాట టైటిల్ సాంగ్‌గా వస్తుంది,” అన్నారు హన్సిక.
త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అంటున్నారు మేకర్స్.