హనీమూన్ నుంచి రాగానే..!

- Advertisement -

హీరోయిన్ నయనతార పని మొదలుపెట్టింది. హానీమూన్ నుంచి రాగానే షూటింగ్ షురూ చేసింది.

భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఆమె వారం రోజుల పాటు థాయిలాండ్ లో హనీమూన్ ట్రిప్ వేసింది. షారుక్ ఖాన్ తో కలిసి ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటోంది. నిజానికి, హైదరాబాద్ లో గత వారం ప్రారంభమైన ‘జవాన్’ షూటింగ్ షెడ్యూల్ లోనే ఆమె పాల్గొనాలి. కానీ, తన చిత్రం కోసం ఆమె హనీమూన్ క్యాన్సిల్ చేసుకుందని తెలుసుకున్న షారుక్ ఆ జంటని తిట్టి …వెంటనే ఒక వారం వెళ్ళిరండి అని పంపారు.

దాంతో, అప్పటికప్పుడు నయనతార, విగ్నేష్ థాయిలాండ్ వెళ్లి వచ్చారు. ఇప్పుడు ముంబైలో మొదలైన కొత్త షెడ్యూల్ లో నయనతార పాల్గొంటోంది. ఆమెకిదే మొదటి బాలీవుడ్ చిత్రం. తొలి చిత్రంతోనే ఆమె షారుక్ సరసన నటిస్తోంది.

నయనతార పెళ్ళికి ముందే పలు చిత్రాలు ఒప్పుకొంది. అవన్నీ పూర్తి చేసే పనిలో ఉంది. ఇవన్నీ విడుదలైన తర్వాత కూడా ఆమె కెరియర్ కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.

ఆమెకిప్పుడు 35 ఏళ్ళు. మరి పిల్లలని కనే ఆలోచన చేస్తే కెరియర్ కి కామా పెట్టాల్సి ఉంటుంది.

 

More

Related Stories