వర్మ, నాగబాబు ఒకే పార్టీ!

- Advertisement -
RGV and Nagababu

రాజకీయాల్లో, సినిమాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అనేది సామెత. అది మరోసారి నిజమైంది. ట్విట్టర్ వేదికగా ఒకప్పుడు ఒకరిపై ఒకరు ఘోరమైన కామెంట్స్ చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ, నాగబాబు. ఇప్పుడు వర్మకి సపోర్ట్ గా వచ్చారు నాగబాబు.

నాగబాబు మెగా బ్రదర్ కాదు మెగా పారసైట్ (మరొకరిపై ఆధారపడే జీవి) అని వర్మ గతంలో విమర్శించారు. దానికి కౌంటర్ గా వర్మని అక్కుపక్షి అని తిట్టారు నాగబాబు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న టికెట్ ధరల తగ్గింపు నిర్ణయంపై చెడుగుడు ఆడుతున్నారు వర్మ.

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 ప్రశ్నలు,” అంటూ ఒక వీడియోని విడుదల చేశారు. ఈ ట్వీట్ ని, ఈ వీడియోని నాగబాబు మెచ్చుకున్నారు. తాను ప్రశ్నించాలని అనుకున్న వాటిని వర్మ సూటిగా సంధించినందుకు నాగబాబు అభినంధించారు. మొత్తమ్మీద వర్మ, నాగబాబు టికెట్ ధరల అంశం వల్ల ఒక పక్షం అయిపోయారు.

ఐతే, వర్మ ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో, నాగబాబు ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతానికి వీరి ట్విట్టర్ బంధం హాట్ టాఫిక్ అయింది.

 

More

Related Stories