“మర్డర్”తో జాగ్రత్తపడిన వర్మ

- Advertisement -
Rgv News 0

“మర్డర్” సినిమాపై కేసు పడింది. ఆ సినిమా షూటింగ్ ఆపేయాలని… అమృత, మారుతిరావు, ప్రణయ్ తదితర పేర్లను ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రణయ్ తండ్రి కోర్టను ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. షూటింగ్ ను ఆపడానికి నిరాకరించినప్పటికీ.. దర్శకనిర్మాతలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు మిర్యాలగూడ పోలీసులు ఆర్జీవీ, నట్టికుమార్ లపై కేసు నమోదుచేశారు.

ఈ అనుభవంతో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న “పవర్ స్టార్” అనే సినిమా విషయంలో జాగ్రత్తపడుతున్నాడు వర్మ. పవన్ కల్యాణ్ జీవితంలోని కొన్ని ఘట్టాలతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నాడనే విషయం అందరికీ తెలుసు. ఈ మేరకు పవన్ ను పోలిన వ్యక్తితో ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు వర్మ.

ఇప్పుడీ సినిమాపై కూడా “మర్డర్” తరహాలో కేసు పడుతుందని ఊహించిన ఆర్జీవీ ముందుజాగ్రత్త చర్యగా ప్రకటన చేశాడు. “పవర్ స్టార్” అనే సినిమా ఫిక్షన్ కథతో వస్తోందని ట్వీట్ చేశాడు వర్మ.

ఓ పెద్ద సినిమా స్టార్ రాజకీయ పార్టీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయే లైన్ తో “పవర్ స్టార్” అనే మూవీ వస్తోందని ప్రకటించిన వర్మ.. వాస్తవంగా ఇది ఎవరికైనా దగ్గరగా అనిపిస్తే అది కేవలం యాథృచ్ఛికమే తప్ప నిజం కాదంటున్నాడు.

More

Related Stories