పబ్ లో రచ్చ చేసిన వర్మ

లాక్ డౌన్ టైమ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రామ్ గోపాల్ వర్మ మాత్రమే. అప్పట్నుంచి తన జోరును కొనసాగిస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. అదే ఊపులో తాజాగా “డేంజరస్” అనే మరో సినిమాను పూర్తిచేశాడు. ఇండియాలో మొట్టమొదటి లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ఇదే అంటున్నాడు.

ఈ సినిమా విశేషాలు చెప్పుకొచ్చాడు వర్మ. సినిమా కోసం గోవాలోని కొన్ని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేశామని.. పొద్దున్నంతా షూట్ చేయడం, సాయంత్రం ఫుల్ గా ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయిందని తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చాడు.

రామ్ గోపాల్ వర్మ తీసిన “బ్యూటిఫుల్” సినిమాలో నటించిన నైనా గంగూలీ.. ఇదే దర్శకుడు తీసిన “థ్రిల్లర్” అనే సినిమాలో నటించిన అప్సర రాణి, ఈ “డేంజరస్” లో హీరోయిన్లు. వీళ్లిద్దరి రొమాన్స్ హైలెట్ అంటున్న వర్మ.. సాయంత్రమైతే ఇద్దరితో కలిసి పబ్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఏమాత్రం మొహమాటపడకుండా ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో కూడా పెడుతున్నాడు.

Related Stories