ఫ్యామిలీ మేన్ కి ఆర్జీవీ ప్రశంస

The Family Man 2


‘ది ఫ్యామిలీ మేన్ 2’ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రామ్ గోపాల్ వర్మకి కూడా తెగ నచ్చిందట. జేమ్స్ బ్యాండ్ లా ఫ్యామిలీ మేన్ కూడా ఒక సిరీస్ గా అలా కంటిన్యూ అవుతుందని గట్టిగా చెప్తున్నారు ఆర్జీవీ. ఐతే ఈ జేమ్స్ బ్యాండ్ వాస్తవానికి దగ్గరగా ఉన్నాడట.

“ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, వినోదం అన్నింటిని ఒకే దాంట్లో కలపడం చాలా సంక్లిష్టమైనది. మనోజ్ బాజ్ పేయ్ లాంటి అద్భుతమైన నటుడికి మాత్రమే సాధ్యమిది. రియలిస్టిక్, డ్రమాటిక్ మధ్య ఉన్న గీతని దాటకుండా, బ్యాలన్స్ చెయ్యడం అతనికే చెల్లింది,” అని వర్మ ప్రశంసలు కురిపించారు.

వర్మ తీసిన ‘సత్య’ సినిమాతోనే మనోజ్ బాజ్ పేయ్ నటుడిగా నిలదొక్కుకున్నాడు. తన గురువు నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో… ఇది తనకు అవార్డు అంటూ మురిసిపోయాడు మనోజ్.

రాజ్ – డీకే రూపొందించిన ఈ సిరీస్ లో సమంత కూడా నటించింది. ఐతే, ఆమె గురించి వర్మ ఏమి రాయలేదు.

‘ది ఫ్యామిలీ మేన్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. చెన్నై నేపథ్యంగా సాగింది ఈ రెండో సీజన్. మొదటి సీజన్ కూడా సూపర్ హిట్.

 

More

Related Stories