
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎందరో ఫిల్మ్ మేకర్స్ కి ఆదర్శం. దర్శకుల్లో అప్పుడు ఒక ఐకాన్. ఆయన సినిమా కోసం ఫిలిం లవర్స్ అందరూ ఎదురు చూసేవారు. తరం మారింది… వర్మ క్రియేటివిటీ తగ్గింది. కానీ, ఆయన యూట్యూబ్ వీడియోల కోసం ఎదురు చూస్తున్నారట నేటి జెనరేషన్. అంటే, ఇప్పుడు ఆయన యూట్యూబ్ సూపర్ స్టార్ గా మారిపోయారా?
వర్మ ఆ మధ్య అనేక చిన్న సినిమాలను నిర్మించారు. కానీ అవి ఆయనకి పబ్లిసిటీ తీసుకురావడం మినహా పేరు తీసుకురాలేదు. అలాగే, ఈ మధ్య స్పార్క్ అనే ఒటిటి కంపెనీకి మొత్తం కంటెంట్ అందించే బాధ్యతలు తీసుకున్నారు. కానీ కరోనా రెండో వేవ్ బాగా దెబ్బ కొట్టింది. దాంతో, ఆయన మరోసారి యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వాటి ఆదాయంపై ఫోకస్ పెట్టారని కామెంట్ వినిపిస్తోంది.
సోషల్ మీడియా జనాల్ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలో వర్మకు తెలుసు. అందుకే ఆయన యూట్యూబ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. అలా.. ఆయన యూట్యూబ్ వరకు సూపర్ స్టార్ అయ్యారు.
ఇంటర్వ్యూలు ఎలా ప్లాన్ చెయ్యాలో, జనాల్ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలనే విషయంలో కొత్తగా ఆలోచించడం వంటివి నన్ను చూసి నేర్చుకోండని జర్నలిస్టులకు సలహాలు ఇస్తున్నారు వర్మ.