ఊర్మిలకి ఆర్జీవీ ఫుల్ సపోర్ట్

Urmila Matondkar

ఊర్మిళ మతోండ్కర్, రామ్ గోపాల్ వర్మ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 15 ఏళ్ల తరువాత వర్మ, ఊర్మిళకి సపోర్ట్ ఇచ్చాడు. ఊర్మిళ ఇటీవల కంగనాకి వ్యతిరేకంగా కామెంట్లు చెయ్యడంతో బీజేపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని ఆమెని ట్రోల్ చెయ్యడం మొదలు పెట్టాయి. ఊర్మిళపై కంగనా నేలబారు విమర్శలు చేసింది. “సాఫ్ట్ పోర్న్ స్టార్ ” అని కామెంట్ చేసింది. అంతేకాదు, ఊర్మిళ నటిగా ప్రూవ్ చేసుకున్నది ఏమిలేదు అని విమర్శించింది.

దాంతో… రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యాడు. “ఈ తిట్ల పురాణంలో నేను కలగచేసుకోదలుచుకోలేదు కానీ ఊర్మిళ వైవిధ్యమైన చిత్రాల్లో నటించింది. క్లిష్టతరమైన పాత్రల్లో మెప్పించింది. ‘రంగీలా’, ‘కౌన్’, ‘భూత్’, ‘ఏక్ హసీనా తీ’ సినిమాలు చాలు ఆమె నటన గురించి చెప్పడానికి,” అని వర్మ ఆమె నటనని పొగిడాడు.

Also Read: కంగనాపై ఊర్మిళ ఫైర్

కంగనా ఈ సినిమాలు అన్ని చూసి ఉండదు. ఆమెకి “అన్నే నేనే” అనే ఫోబియా పట్టుకొంది. సినిమా ఇండస్ట్రీలో తానే ఫస్ట్ ఫెమినిస్ట్ అన్న బిల్డప్ కూడా ఇచ్చింది మొన్నే. ఊర్మిళ కన్నా తాను ఎక్కువగా అందాలు ఆరబోసిన విషయాన్ని కూడా మర్చిపోయింది. బీజేపీ, బీజేపీ అనుకూల మీడియా అండతో, రైట్ వింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ సపోర్ట్ తో కంగనా చెలరేగుతోంది. ఐతే, కొందరు ఫిల్మ్ మేకర్స్, బుర్రపెట్టి ఆలోచించే జర్నలిస్టులు మాత్రం ఆమె పిచ్చి మాటలు, చేష్టలను ఎక్స్ పోజు చేస్తూనే ఉన్నారు. వర్మ కూడా ఈ విషయంలో మొదటినుంచి గట్టిగా స్పందిస్తున్నారు.

Also Read: ‘పడుకుంటేనే కదా ఛాన్స్ ఇచ్చారు’

ఊర్మిళని స్టార్ హీరోయిన్ గా మలిచింది రామ్ గోపాల్ వర్మనే. “అంతం”, “గాయం”, “రంగీలా”, “సత్య”, “దౌడ్”, “కౌన్” వంటి సినిమాలు ఆమెతో తీశాడు వర్మ. ఆ తర్వాత వర్మ, ఊర్మిళ దారులు వేరు అయ్యాయి. 2004 తర్వాత ఆమె వర్మ డైరెక్షన్ లో కానీ, ప్రొడక్షన్ లో కానీ నటించలేదు. 2016లో ఒక కాశ్మీరీ వ్యాపారవేత్తని పెళ్లాడింది ఊర్మిళ. రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరింది.

“రంగీలా” రిలీజ్ అయి 25 ఏళ్ళు ఐన సందర్భంగా వర్మ, ఊర్మిళ ఇటీవల జూమ్ ఇంటర్వ్యూలో కలుసుకోవడం విశేషం.

Related Stories